![]() |
![]() |
.webp)
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో.. బిగ్ బాస్ ఓటీటీ 2ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి కంటెస్టెంట్స్ ని కూడా ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరుతో 2022 ఫిబ్రవరీ నుండి మే వరకు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను కూడా దాదాపు జనవరి, ఫిబ్రవరీలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే కంటెస్టెంట్స్ లో సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క ఫైనల్ ఐనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్.. తనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చి కొన్ని ఎపిసోడ్స్ వరకు తన పాటలతో అందరినీ అలరించిన భోలే షావలి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో రీఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మిడిల్ లో ఒక న్యూస్ వైరల్ గా మారింది. హీరోయిన్ రిచా, సింగర్ పార్వతి, హీరోయిన్ సోనియా, డ్యాన్స్ మాస్టర్ యశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ భద్రం పేర్లు కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. నవాబ్ కిచెన్ తో ట్రెండ్ అవుతోన్న మోయిన్ భాయ్‌ను కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిని బిగ్ బాస్ నిర్వాహకులు కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే వీళ్లంతా ఈ రెండేళ్లలో బుల్లితెర మీద, సోషల్ మీడియాలో మెరిసిన వాళ్ళు, మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నవాళ్ళే. ఇకపోతే రీసెంట్ గా ఎండ్ ఐన బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. అందులోనూ రైతు బిడ్డ టాగ్ తో పల్లవి ప్రశాంత్ విన్నర్ గ సీరియల్ బ్యాచ్ అమర్ దీప్ రన్నర్ గ నిలిచారు . తెలుగులో సీజన్ 1 ఒకటే సెలబ్రిటీ షోగా అద్భుతమైన రేటింగ్ తో సాగింది . ఆ తరువాత సెకండ్ సీజన్ నుంచి సినిమా వాళ్లు.. సీరియల్స్ బ్యాచ్.. యాంకర్లు.. యూట్యూబర్లు , కామన్ మ్యాన్స్ రావడం మొదలుపెట్టేసరికి ఎవరెవరో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. మరి ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఎలా ఉంటుందో ఎవరెవరు వస్తారో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి.
![]() |
![]() |